హుక్కా సెంటర్ పై పోలీసుల దాడులు.. కాలేజీ యూనిఫామ్‌లో పట్టుబడ్డ మైనర్లు

మత్తు పదార్థాలు, హుక్కా సెంటర్ల నిర్వహణపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పొతుంది. తరచూ గంజాయి డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.

Update: 2024-10-01 17:23 GMT

దిశ, శేరిలింగంపల్లి: మత్తు పదార్థాలు, హుక్కా సెంటర్ల నిర్వహణపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పొతుంది. తరచూ గంజాయి డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా ఇళ్ల మధ్యలో హుక్కా సెంటర్ నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటనకు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. శాంతినగర్‌లో ఇళ్ల మధ్యనే యథేచ్ఛగా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నారు కొందరు ప్రబుద్దులు. నిర్వాహకులు మైనర్లకు సైతం హుక్కా సప్లై చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

కాలేజీకి డుమ్మా కొట్టి విద్యార్థులు యూనిఫాంలో హుక్కా సెంటర్ కు వచ్చి నిర్భయంగా హుక్కా సేవిస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా ఇళ్ల మధ్యలో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానికులు పలుమార్లు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. పక్కా సమాచారంతో మంగళవారం చందానగర్ పోలీసులు హుక్కా సెంటర్ పై రైడ్ చేశారు. హుక్కా కి సంబంధించిన సామాగ్రిని సీజ్ చేశారు. హుక్కా సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చందానగర్ పోలీసులు తెలిపారు.


Similar News