కల్తీ స్వీట్లు తయారు చేస్తున్న గోదాంపై పోలీసుల దాడులు
కల్తీ స్వీట్ లు తయారు చేస్తున్న గోదాంపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొఘల్ పుర పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు.
దిశ, చార్మినార్ : కల్తీ స్వీట్ లు తయారు చేస్తున్న గోదాంపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొఘల్ పుర పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. వివరాలలోకి వెళితే...ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన భోళా శంకర్ ఐదేళ్ల క్రితం లాల్ దర్వాజా ప్రాంతంలో ని ఓ సెల్యూలర్ ను అద్దెకు తీసుకున్నాడు. శంకర్ రాజస్థాన్ నుంచి స్కిమ్ మిల్క్ పౌడర్ ను అక్రమంగా
తీసుకు వచ్చి కలాకన్, అజ్మీర్ కలాకన్ తో పాటు కోవాను తయారు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్ స్పెక్టర్ సంతోష్ బృందంతో పాటు మొఘల్ పుర ఇన్ స్పెక్టర్ శివకుమార్, జీహెచ్ ఎంసీఫుడ్ సేఫ్టీ అధికారులు మూర్తి రాజ్, ఫరీద్ ల తో కలిసి మంగళవారం స్వీట్లు తయారీ గోదాం పై దాడులు నిర్వహించారు. అందులో తయారు చేస్తున్న కలాకన్, అజ్మీర్ కలాకన్ తో పాటు కోవాను టెస్టింగ్ కు పంపారు.