బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఓయూలో ప్రతిజ్ఞ
గత తొమ్మిది సంవత్సరాలుగా విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిన బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం ప్రతిజ్ఞ చేశారు.
దిశ, సికింద్రాబాద్ : గత తొమ్మిది సంవత్సరాలుగా విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిన బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా, వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి తీరుతామ్మనారు.
టీఎస్పీఎస్సీ లీకులతో విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి, నిరుద్యోగి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామానికి తరలి వెళ్లి ప్రజలను చైతన్య పరచి బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలిని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు గ్యార నరేష్ , ఓయూ కార్యదర్శి నెల్లి సత్య , సహాయ కార్యదర్శి అరేకంటి భగత్, హైదరాబాద్ అధ్యక్షులు చైతన్య యాదవ్, ఓయూ అధ్యక్షులు ఇరిగి లెనిన్, నాయకులు కళ్యాణ్, రాజు, రాధాకృష్ణ, గోపాల్, రాఘవేందర్, సుమన్, ఉదయ్, సంతోష్, కార్తీక్, ప్రదీప్, రాము తదితరులు పాల్గొన్నారు.