Numaish : నాంపల్లిలో మొదలైన నుమాయిష్

హైదరాబాద్ లోని నాంపల్లిలో నుమాయిష్(Namapally Numaish) అట్టహాసంగా ప్రారంభం అయింది.

Update: 2025-01-03 16:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని నాంపల్లిలో నుమాయిష్(Namapally Numaish) అట్టహాసంగా ప్రారంభం అయింది. 84వ అఖిల భారత వస్తు ప్రదర్శనశాల(Numaish)ను శుక్రవారం సాయంత్రం మంత్రులు శ్రీధర్ బాబు(Sridhar Babu), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రారంభించారు. సందర్శకుల కోసం మూడు ఎంట్రీ గేట్స్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు.. వారంతాల్లో, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. నెలరోజుల పాటు సాగే ఈ ప్రదర్శన మొత్తం సీసీటీవి పర్యవేక్షణలో ఉండగా.. గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. కాగా ఈ నుమాయిష్ 1938 నుంచి ప్రతి ఏటా జనవరి నెలలో కొనసాగుతోంది.   

Tags:    

Similar News