మూసీ ప్రక్షాళనపై కేటీఆర్ అప్పుడలా.. ఇప్పుడిలా..!

మూసీ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-10-03 15:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీపై కేటీఆర్ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉన్నపుడు నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడర్ ఆఫీస్‌లో జనవరి 2022లో ఉన్నతాధికారులతో రివ్యూ చేశారని, మూసీనది బఫర్ జోన్ నిర్ధారించుటకు ఎడమవైపు 55 కి.మీ, కుడి వైపు 55 కి.మీ హద్దులు పెట్టాలని నిర్ణయించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మూసీని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారనే తరహాలో కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.


ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల వినియోగం కోసం మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారని, ఇలాంటి సందర్భంలో అడ్డుపుల్లలు వేయడం బంద్ మానుకోవాలని కోరారు. ధన దాహానికి కక్కుర్తి పడి జోన్లను మార్చి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చింది? ఎవరు? అని ప్రశ్నించారు. ప్రకృతి సహజ సిద్ధ సంపదను దోచుకొని ఇప్పుడు కేటీఆర్ నీతులు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం కేటీఆర్ ప్రజలను రెచ్చకొడుతున్నారని బండి సుధాకర్ గౌడ్ మండిపడ్డారు.


Similar News