కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)లపై కేసు నమోదైంది.

Update: 2024-10-03 16:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)లపై కేసు నమోదైంది. గురువారం హైదరాబాద్‌(Hyderabad)లోని సైబర్ క్రైమ్ ఆఫీస్‌(Cyber ​​Crime Office)లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) ఫిర్యాదు మేరకు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్‌ ఛానల్స్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ఇటీవల సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఆమె స్వాగతం పలుకుతూ నూలుపోగు దండా వేశారు.

అయితే, దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారని సాక్ష్యాలతో కొండా సురేఖ ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై రఘునందన్ రావు కూడా స్పందించి బీఆర్ఎస్ శ్రేణులపై మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఒక ఆడబిడ్డను అవమానించేలా పోస్టులు పెట్టడం తగదని హెచ్చరించారు. ఇప్పటికే ఈ ఇష్యూపై దుబ్బాక, సిద్దిపేట, సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Similar News