దిశ, వెబ్ డెస్క్: నేడు హైదరాబాద్ మహానగరం న్యూయర్(New Year) వేడుకలతో దద్దరిల్లనుంది. ఇందుకోసం.. అనేక ఆర్గనైజింగ్ సంస్థలు, యువత పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే రాత్రి 12 గంటల తర్వాత న్యూయర్(New Year) సందర్భంగా పెద్ద మొత్తంలో యువకులు బైకులపై తిరుగుతు రోడ్ల మీదకు వస్తారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా.. హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా న్యూయర్ వేడుకల సందర్భంగా.. ట్యాంక్ బండ్(Tank bund) చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) అమలు చేయనున్నారు. ఈ క్రమంలో డ్రంక్ డైవులు(Drunk dives), ఎక్కడిక్కడ చెకప్ లో పెట్టనున్నారు. అలాగే ఐటీ కారిడార్ లో ఉన్న అన్ని ఫ్లైఓవర్లను ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసి వేయనున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అలాగే జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లో పలు పబ్బులు, బార్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం వరకు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్(Special teams) లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.