అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

అన్ని విభాగల అధికారులు సమన్వయంతో పనిచేయాలని

Update: 2024-10-24 16:08 GMT

దిశ, శేరిలింగంపల్లి : అన్ని విభాగల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమిష్టి కృషితో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ అధికారులకు పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై గురువారం జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ జయరాం రెడ్డిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ రహిత సమాజం కోసం ట్రాఫిక్ మెరుగుదల పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫుట్ పాత్ ల ఆక్రమణలను తొలగించాలని, ఫుట్ పాత్ లను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాటసారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలన్నారు. ప్రజలకు మెరుగైన సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ముఖ్య కూడళ్లను సుందరవణంగా తీర్చిదిద్దుతామని, పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రజావసరాల దృష్ట్యా లింక్ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కూడలీల సుందరీకరణ చేపట్టాలని, చెరువుల సుందరీకరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీపడకూడదని, అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని పీఏసీ చైర్మన్ గాంధీ ఆదేశించారు.

నియోజకవర్గంలో ఎక్కడ మంచి నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, మురుగు నీటి వ్యవస్థ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎక్కడ మురుగు నీరు రోడ్ల ప్రవాహం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీలు ముకుంద రెడ్డి, మోహన్ రెడ్డి, సురేష్, సుల్తానా, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, జలమండలి, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ పోలీస్, ట్రాఫిక్, అర్బన్ బయో డైవర్సిటీ, విద్యుత్, స్ట్రీట్ లైట్స్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News