ఆ నీచ చరిత్ర కేసీఆర్‌దే... ఈసారి ఖాయం: MLA Etala Rajender
రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు....
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ బండి సంజయ్ నాయకత్వంలో విజయాల పరంపర కొనసాగిందన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పారు. తెలంగాణ గడ్డపై బీజేపీ గెలవాలని, కాషాయ జెండా ఎగరాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలిచ్చారని ఈటల తెలపారు.
ఇక బీజేపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఫ్లెక్సీ విషయంలో మంగళ్‌హాట్ బీజేపీ కార్పొరేటర్ శశికళపై దుర్మార్గంగా కేసులు పెట్టారని ఆయన మండిపడ్దారు. మహిళా కార్పొరేటర్‌పై 307 కేసు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహాన్ని అపవిత్రం చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తే అక్కడి యువకులపై కేసులు పెట్టి 14 రోజులు పాటు జైలుకు పంపించిన నీచమైన చరిత్ర కేసీఆర్‌ది అని ఈటల ధ్వజమెత్తారు. డబ్బు సంచులతో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలందరూ కలిసి కట్టుగా పని చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఈటల హెచ్చరించారు.