ఉచితంగా 5 లక్షల మట్టి విగ్రహాల పంపిణీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు పిలుపునిచ్చారు.

Update: 2023-09-14 07:02 GMT

దిశ సిటీ బ్యూరో: పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు పిలుపునిచ్చారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో తయారు చేసిన ఐదు లక్షల మట్టి విగ్రహాల పంపిణీ నీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్‌తో కలిసి గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 వార్డులతో పాటు అదనంగా మరో 50 లొకేషన్‌లతో కలుపుకొని మొత్తం 200 ప్రాంతాల్లో ఈ విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News