తెలుగు సినిమాకి చిరంజీవి గర్వకారణం: మంత్రి కోమటిరెడ్డి

మెగాస్టార్ చిరంజీవికి “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”లో చోటు దక్కించుకోవడం హర్షనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ...

Update: 2024-09-22 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవికి “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”లో చోటు దక్కించుకోవడం హర్షనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు సినిమాకి చిరంజీవి ఎంతో గర్వకారణమని ఆయన తెలిపారు. తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాక.. ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. తన కెరీర్లో మొత్తం 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిందన్నారు. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను చేరుకున్న చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకొవాలని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.


Similar News