ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: HarishRao

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి బాధాకరమని రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు..

Update: 2023-09-28 11:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి బాధాకరమని రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాలను సృష్టించి, ఆహార రంగంలో మన దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు అని ఆయన తెలిపారు. తన పరిశోధనలు, సిఫారసుల ద్వారా అటు రైతులకు ఆదాయం పెంచడంతో పాటు, ఇటు దేశ ప్రజల ఆహార కొరతను తీర్చిన మహానుభావుడు స్వామినాథన్. దేశ రైతాంగం ప్రపంచ ప్రజల ఆకలిని తీర్చే స్థాయికి ఎదగడానికి కారణం స్వామినాథన్ సృష్టించిన హరిత విప్లవమే అని మంత్రి పేర్కొన్నారు. ఆయన మరణం పరిశోధన రంగంతో పాటు యావత్ దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Tags:    

Similar News