బీజేపీ విడుదల చేసిన ఖాజీ పోస్టర్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఘాటు రిప్లై
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెళ్లి అంటూ బీజేపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది....
దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెళ్లి అంటూ బీజేపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది... ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని ఈ పోస్టర్‌లో పెళ్లి పెద్దగా (ఖాజీగా ) అభివర్ణించింది. దీంతో ఈ పోస్టర్‌పై అసదుద్దీన్ స్పందించారు. ఈ వయసులో నా ఫోటో పెళ్లి కార్డులో ఉంది. ‘‘నేను అందరికి పెళ్లి కొడుకునా.. లేక సోదరుడినా..? ’’ అంటూ ప్రశ్నించారు.. ‘‘ఒక కార్టూన్‌లో, నేను కాంగ్రెస్, బీఆర్ఎస్ వివాహాన్ని నిర్వహిస్తున్నట్లు ఖాజీగా చూపించారు. తెలంగాణలో ప్రధాని మోడీ ఫొటో తమకు పనికి రాదని ఇప్పుడు అర్థమైంది. అసదుద్దీన్ ఫొటో పెడితే వారికి లాభమని ఆలోచిస్తున్నారు. మీ మోడీ ఫొటో ఎలాంటి ప్రభావం చూపడం లేదు, కాబట్టి ఇలానే కానివ్వండి.’’ అంటూ ఓ బహిరంగ సభలో బీజేపీపై కామెంట్స్ చేశారు. తాను ఖాజీ అయితే, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని ఓవైసీ తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ఫొటో బీజేపీకి పనికిరాదని, అందుకే తన ఫొటో పెట్టారని ఓవైసీ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రధాని మోడీ ప్రభావం చూపకపవోడంతో బీజేపీ తన ఫొటోలు వాడుకుంటుందని ఎద్దేవా చేశారు