సేవకుడిగా వస్తున్నా దీవించండి.. కేఎల్ఆర్

మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు కల్పించిందని సేవకుడిగా పనిచేసి ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తానని ప్రతి ఒక్కరు తనను దీవించాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు.

Update: 2023-10-30 13:03 GMT

దిశ, చైతన్య పురి : మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు కల్పించిందని సేవకుడిగా పనిచేసి ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తానని ప్రతి ఒక్కరు తనను దీవించాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం అలకపురిలోని కాంగ్రెస్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు సేవచేయడానికి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారి పట్ల కఠినంగా ఉంటూ కబ్జాలు చేస్తూ దుర్మార్గపు పనులు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. అబ్దుల్ కలాం ఆలోచన విధానంతో పేదవారికి సేవచేస్తానని పేర్కొన్నారు. మాట తప్పిన కేసీఆర్ పథకాలు ప్రజలు విశ్వసించడం లేదని విమర్శించారు.

నేటి వరకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని ప్రజలు ఏకరువు పెడుతున్నారని తెలిపారు. ప్రజలకు, దొరల పాలనకు మధ్యన పోటీ జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పార్టీ మారిన మంత్రి సబిత ఇంద్రారెడ్డిని తుక్కుతుక్కుగా ఓడించడానికి ప్రతి కార్యకర్త కంకణ బద్దుడై పనిచేయాలని కోరారు. పార్టీ మారిన వారిని శిక్షించాలని పిలుపునిచ్చారు. బీజేపీ విభజించు పాలించు అనే సూక్తి ద్వారా కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతుందని దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీములను ప్రతి గడపగడపకు చేరవేసి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో దేప భాస్కర్ రెడ్డి, చల్ల నరసింహారెడ్డి, అమరేందర్ రెడ్డి, జంగారెడ్డి, పున్న గణేష్, ధనరాజ్, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News