రోగి సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్..

రోగి సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని మెడి-9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట రామిరెడ్డి అన్నారు.

Update: 2024-07-01 12:28 GMT

దిశ, హిమాయత్ నగర్ : రోగి సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని మెడి-9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట రామిరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడి - 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్(ఐఎంఎస్) లోగోను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ రమణ రాజు, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ విజయలక్ష్మిలతో కలసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ ను, సమీకృతీకరించి మెడి-9 హెల్త్ సైన్సెస్ సంస్థ హెూమియోపతి, ఆయుర్వేద, పేషెంట్ సమగ్ర సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మంచి అవకాశాలను అందిస్తుందన్నారు.

ఈ వ్యవస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖ, మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఐసీఎంఆర్ భాగస్వామిగా ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. ఈ విధానంలో ఆయుర్వేదం, హెూమియోపతి, నేచురోపతి ఆక్యుపంక్చర్, అక్యూప్రెషర్ సిద్ధ యోగా, హెర్బల్, కిరో ప్రాక్టిక్ వంటి ప్రత్యామ్నాయ లేదా సాంప్రదాయ పద్దతులతో 'పాశ్చాత్య' వైద్యాన్ని మిళితం చేస్తుందన్నారు. గత 30 ఏళ్లకు పైగా అనుభవం నిపుణత, పరిశీలన కలిగిన డాక్టర్స్ బృందం వ్యాధి కారకాలను తెలుసుకుని వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ చికిత్స లో మెడిసిన్, ఎక్సర్ సైజ్, డైట్, ఇమ్మ్యూనిటీ బూస్టర్స్ ద్వారా చికిత్సను అందిస్తారని తెలిపారు.

Similar News