తాట తీస్తాం.. కేటీఆర్‌కు సునీతారావు హెచ్చరిక

మాజీ మంత్రి కేటీఆర్ తాట తీస్తామని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు హెచ్చరించారు. ....

Update: 2024-10-03 15:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి కేటీఆర్ తాట తీస్తామని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు హెచ్చరించారు. గురువారం గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలంతా కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ మహిళల మీద ట్రొల్స్ చేయడం తగదని, వెంటనే కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఒకసారి ఉమెన్ కమిషన్ ముందు హాజరయ్యారని, అయినా కేటీఆర్ వ్యవహారశైలీలో మార్పు లేదన్నారు. నిత్యం మహిళల మీద చేస్తున్న వ్యాఖ్యలను కేటీఆర్ మానుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కొవ్వాల్సి ఉంటుందని సునీతారావు హెచ్చరించారు. 


Similar News