19 నుంచి మాదిగల మేల్కొలుపు యాత్ర

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఈ నెల 19 నుంచి హైదరాబాద్ సాయి నగర్ నుంచి మాదిగల మేల్కొలుపు యాత్ర నిర్వహించనున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు.

Update: 2024-09-08 15:25 GMT

దిశ, ఖైరతాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఈ నెల 19 నుంచి హైదరాబాద్ సాయి నగర్ నుంచి మాదిగల మేల్కొలుపు యాత్ర నిర్వహించనున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎస్సీ జనాభా ఎంత ఉందో వారి జనాభా దమాషా ప్రకారం ఆ జిల్లాల వారీగా రిజర్వేషన్ ఫలాలు అందాలని ఈ ప్రతిపాదనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారని తెలిపారు.

    ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా వర్గీకరణ చేసే అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్రంలోనూ అదే విధంగా చేపట్టి రానున్న విద్యా ఉద్యోగ రంగాలలో వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నియామకాలు చేపట్టబోయే డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలగు ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ వర్గీకరణ అనుగుణంగా రిజర్వేషన్లు జిల్లాల వారీగా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు 19న ప్రారంభమై  తెలంగాణలోని అన్ని జిల్లాల్లోమేల్కొల్పు యాత్ర జరిగి సెప్టెంబర్ 30న భువనగిరిలో ముగుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఒకలగడ్డ చంద్రశేఖర్, సురేందర్ సన్నీ, గజ్వేల్ మల్లికార్జున్, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News