Former Vice President : భారతీయ నృత్య కళల్లో కూచిపూడి నృత్యం ఒకటి..

చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతి పట్ల మమకారంతో భారతీయ నృత్యకళల్లో ఒకటైన కూచిపూడి నృత్యాన్ని అభ్యసించడం మంచి విషయం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Update: 2024-07-29 15:31 GMT

దిశ, రవీంద్రభారతి : చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతి పట్ల మమకారంతో భారతీయ నృత్యకళల్లో ఒకటైన కూచిపూడి నృత్యాన్ని అభ్యసించడం మంచి విషయం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువు చూపించే మార్గంలో ముందుకు సాగినప్పుడే ఉన్నతంగా ఎదగవచ్చని సోమవారం రవీంద్రభారతి ప్రధాన మందిరంలో దీపాంజలి స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ కూచిపూడి ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యగురువు, తెలంగాణ సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ దీపికా రెడ్డి శిష్యురాలు చేతన బుద్ధిరాజు కూచిపూడిలో అరంగేట్రం చేశారు. ఆమె సంప్రదాయంలో చక్కటి అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసులు విద్వాన్ మల్లాది శ్రీ రాంప్రసాద్, విద్వాన్ డా. మల్లాది రవికుమార్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొ.జొన్నలగడ్డ అనురాధ, నర్తకీ తల్లిదండ్రులు రాజేశ్వరి, విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News