విజయవర్ధన్ రావు కిడ్నాప్ కేసులో... కల్వకుంట్ల కన్నారావు కారు సీజ్
సాఫ్ట్ వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలో కల్వకుంట్ల కన్నారావు కారును బంజారా హిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దిశ, ఖైరతాబాద్ : సాఫ్ట్ వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలో కల్వకుంట్ల కన్నారావు కారును బంజారా హిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కన్నారావు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. కన్నారావు కారులో కిడ్నాప్ చేసి తనను తీసుకు వెళ్లాడని జయవర్ధన్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కారును సీజ్ చేశారు. కన్నారావు తో పాటు మరికొందరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం విధితమే..