అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల ఉక్కుపాదం

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ సెల్( హైడ్రా) ఉక్కుపాదం మోపుతుంది.

Update: 2024-08-10 10:45 GMT

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ సెల్( హైడ్రా) ఉక్కుపాదం మోపుతుంది. చందానగర్ సర్కిల్ హఫీజ్ పేట్ డివిజన్ వైశాలి నగర్ లో ఈర్ల చెరువు బఫర్ జోన్ లో రోడ్ నెంబర్ 7 ప్లాట్ నెంబర్ 148, 149,150లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొద్దిరోజులుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేతలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాలను, చెరువు కబ్జాలను ఉపేక్షించబోమని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Tags:    

Similar News