Hyderabad: రెండో రోజు కొనసాగుతోన్న నిమజ్జనాలు.. ఆ రూట్లలో బారులు తీరిన గణనాథులు

హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి.

Update: 2024-09-18 04:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తుండటంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు రద్దీగా మారాయి. ముఖ్యంగా బషీర్‌బాగ్, బర్కత్‌పుర, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగుడ ప్రాంతాల నుంచి గణనాథులు నిమజ్జనానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు క్యూ కట్టాయి. ఇక ఓల్డ్ సిటీ నుంచి వచ్చే గణనాథులతో బషీర్‌బాగ్‌లోని బాబుజగ్జీవన్‌రావు విగ్రహం వరకు క్యూ కొనసాగుతోంది. దీంతో గణేష్ నిమజ్జనాలు ఇవాళ సాయంత్రం వరకు ముగిసే అవకాశం ఉందని పోలీసుల ఉన్నతాధికారులు తెలిపారు.

అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లో నిమజ్జనం కోసం గణపతులు క్యూ కట్టాయి. పాతబస్తీలో ప్రాంతంలో ఎలాంటి ఘర్షణలకు ఆస్కారం లేకండా శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటి వరకు 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లుగా జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 విగ్రహాలు, ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌ వద్ద 4,730 విగ్రహాలు, నెక్లెస్ రోడ్డులో 2,360 విగ్రహాలు, పీపుల్స్ ప్లాజా వద్ద 5,230 విగ్రహాలు, హైదరాబాద్ అల్వాల్ కొత్త చెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం అయినట్లుగా అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయని, బుధవారం సాయంత్రంలోగా కార్యక్రమం పూర్తికానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


Similar News