జలవిహార్ పై హైడ్రాకు ఫిర్యాదు

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో గల జలవిహార్ పై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదు అందింది.

Update: 2024-09-18 16:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని నెక్లెస్ రోడ్ లో గల జలవిహార్(Jalavihar) పై చర్యలు తీసుకోవాలని హైడ్రా(HYDRA)కు ఫిర్యాదు అందింది. పర్యావరణ నిబంధనలు, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా హుస్సేన్ సాగర్ పరిధిలోని భారీ స్థాయిలో స్థలాన్ని ఆక్రమించిన జలవిహార్ చర్యలు తీసుకోవాలని సీపీఐ(CPI) హైడ్రాను కోరింది. మాజీ ఎంపీ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఎన్.బాలమల్లేష్, సీనియర్ నేత పశ్య పద్మలతో కూడిన బృందం బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి విన్నవించింది. హుస్సేన్ సాగర్ స్థలాన్ని ఆక్రమించి జలవిహార్ చేపడుతున్న కార్యకలాపాల కారణంగా సాగర్ లోని లక్షలాది జీవరాశుల మనుగడ ప్రశార్థకమైందని వారు సూచించారు. కోర్టు కేసులు, ఇతర డాక్యుమెంట్ల పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధి బృందం కోరింది.


 


Similar News