శంషాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్

ఆగస్టు 15 పంద్రాగస్టు పురస్కరించుకొని శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం లోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే ఎయిర్ పోర్ట్‌లోకి అనుమతిస్తున్నారు.

Update: 2023-08-06 07:16 GMT

దిశ శంషాబాద్ : ఆగస్టు 15 పంద్రాగస్టు పురస్కరించుకొని శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం లోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే ఎయిర్ పోర్ట్‌లోకి అనుమతిస్తున్నారు. నేటి నుండి ఆగస్టు 15 వరకు విమానాశ్రయంలోకి సందర్శకులు ఎవరు నీ అనుమతించాలని ఎవరు రావద్దన్నారు. అంతే కాకుండా అన్ని రకాల పాసులను ఆగస్టు 16 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. విమానాశ్రయంలోని పార్కింగ్, డిపార్చర్,అరైవెల్ లో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్,బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.పంద్రాగస్టు వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విదేశాలకు వెళుతున్న ప్రయాణికులకు వీడ్కోలు తెలపడానికి ఒకరు లేదా ఇద్దరు రావాలి తప్ప అధిక సంఖ్యలో వస్తే అనుమతించారన్నారు. ప్రయాణికులు వాహనదారులు అందరు గమనించి సహకరించాలని కోరారు.


Similar News