హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసులకు GHMC కీలక సూచన

నైరుతి రుతు పవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. నైరుతి ప్రభావంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షం కురుస్తోంది.

Update: 2024-06-13 10:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతు పవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. నైరుతి ప్రభావంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, చైత్యనపురి, కొత్తపేట, మలక్ పేట్‌, కోఠి, అబిడ్స్‌, అంబర్ పేట్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరి కాసేపట్లో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ జీహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేసింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు నగరవాసులకు కీలక సూచన చేశారు. హైదరాబాద్‌లో మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. వర్షం, వరద నీటి వల్ల ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలని చెప్పారు. 


Similar News