సీపీగా తిరిగి రావడం సంతోషంగా ఉంది

వినాయక చవితి రోజు హైదరాబాద్ సీపీగా తిరిగి రావడం సంతోషంగా ఉందని, గణనాథుడి అనుగ్రహంతోనే తాను మళ్లీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‎గా వచ్చానని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. 

Update: 2024-09-10 11:00 GMT

దిశ, ఖైరతాబాద్ : వినాయక చవితి రోజు హైదరాబాద్ సీపీగా తిరిగి రావడం సంతోషంగా ఉందని, గణనాథుడి అనుగ్రహంతోనే తాను మళ్లీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‎గా వచ్చానని సీపీ సీవీ ఆనంద్ అన్నారు.  మంగళవారం ఖైరతాబాద్ వినాయకుడిని సీపీ సీవీ ఆనంద్ దర్శించుకున్నారు. సీపీకి పూర్ణ కుంభంతో అర్చకులు, ఉత్సవ సమితి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద సీవీ ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినాయక ఉత్సవాలను పూర్తి చేశామని గుర్తు చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం గత ఏడాదిలాగే ఈసారి కూడా మధ్యాహ్నంలోపే పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చూసేందుకు లక్షలాది మంది వస్తారన్నారు. ఈ మేరకు ట్రాఫిక్‎ను సమన్వయం చేస్తూ బందోబస్తు పెంచుతామని తెలిపారు. నిమర్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ప్రశాంతంగా గణనాథుడి శోభాయాత్ర ముగిసేలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News