'గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను అమలు చేయాలి'

తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ, పీఎంపీల సేవలను మెరుగుపరిచి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను అమలు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేసి వాళ్ల స్థాయిలో వైద్యం అందే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.

Update: 2024-07-10 12:53 GMT

దిశ, హిమాయత్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ, పీఎంపీల సేవలను మెరుగుపరిచి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను అమలు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేసి వాళ్ల స్థాయిలో వైద్యం అందే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం తెలంగాణ ఆర్ఎంపీపీ, పీఎంపీ ఉమ్మడి సంఘాల వేదిక ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ జరిగింది. ఈ సభకు ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల ఫెడరేషన్ అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్న వాళ్ళ పైన కేసులు బనాయించడం తర్వాత అరెస్టు చేయడం అనేది ఈ సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నారు.

వాళ్లకేదైతే ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ఉన్నాయో వాటిని అమలు చేసి వాళ్లకు పరిధి విధించి వాళ్ల పరిధిలో వైద్యం చేసే విధంగా చేయడమే దానికి సరైన పరిష్కారం మార్గం అని తెలిపారు. మీపై దాడులు జరుగుతున్నాయని మీరు వైద్యవృత్తికి దూరంగా ఉండడానికి వీలులేదని, మిమ్ములను నమ్ముకుని ఎవరైతే పేద ప్రజలు గ్రామాల్లో రైతాంగం ఉన్నారో వాళ్లకు నిర్మొహమాటంగా వైద్యవృత్తిని మీరు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా పది పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రి ని కలిసి వారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఈ సమస్యల పరిష్కారానికి తప్పకుండా ముందుంటాను అని హామీ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ఈ సంఘాలన్ని కలిసి ఒక వేదికగా ఏర్పడి ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడం సంతోషకరం అని చెప్పారు. ఇంకెవరైనా సంఘాల వాళ్ళు ఉంటే వాళ్లంతా కూడా వీళ్ళతో కలిసి వచ్చి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

మీకు అందరికి కావలసింది గుర్తింపు, ఆత్మగౌరవం సర్టిఫికెట్ అదే జెండా కావాలి. కనుక మీరు అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ తప్పకుండా ఈ సమస్యను త్వరగతిన పరిష్కారం అయ్యే విధంగా చూస్తాం అన్నారు. విజ్ఞానదర్శిని వారికి సూచన చేస్తున్నా ఇవాళ ఈ సమస్యను వాళ్లు వీళ్లు అనేటటువంటి కోణంలో చూడడం కాకుండా విజ్ఞానదర్శిని ప్రజావైద్యం, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెడికల్ కౌన్సిల్ వారిని, డాక్టర్స్ అసోసియేషన్స్ వారిని, ఆర్ఎంపీ, పీఎంపీ, సంస్థలను కూర్చుండ బెట్టి ఒక వేదిక ఏర్పాటు చేస్తే దానికి ప్రత్యేక మార్గాన్ని కూడా ఆలోచించడానికి ఉంటుందని నేను రమేష్ ని కోరుతున్నానని. ఎందుకంటే ఇప్పుడు అసలే వర్షాకాలం.. వ్యాధులు ముదిరే అటువంటి సమయంలో ఇలాంటివి రావడం మంచిది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక, డా.వి.బ్రహ్మారెడ్డి, విజ్ఞానదర్శిని రమేష్, ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల నాయకులు వెంకటరెడ్డి బాలబ్రహ్మచారి, పూలగం మోహన్, హుస్సేన్, పంగ మల్లేషం, హరిబాబు, రాజమౌళి, రమాశంకర్, రవి శంకర్, తాహెర్, పిట్టల నాగేశ్వరరావు, గాదాసు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News