ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : సనత్ నగర్ ఎమ్మెల్యే

సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య

Update: 2024-10-23 12:14 GMT

దిశ, బేగంపేట: సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట జె లైన్ కు చెందిన మాధవి కి చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పత్రాన్ని (ఎల్ఓసీ )అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన మాధవి కొంతకాలంగా ఊపిరితిత్తుల కు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంది. మెరుగైన వైద్యం కోసం సహకరించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాధవి తల్లి ఇందిర ఆశ్రయించింది. ఎమ్మెల్యే చొరవతో రూ. 3 లక్షలు మంజూరు కాగా, ఎల్ఓసీ ని ఇందిర కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు చందు, సతీష్, తదితరులు ఉన్నారు.


Similar News