DCP : డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం

డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తుందని డీసీపీ పటేల్ కాంతిలాల్ సుభాష్ అన్నారు.

Update: 2024-11-04 15:05 GMT

దిశ, చార్మినార్ : డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తుందని డీసీపీ పటేల్ కాంతిలాల్ సుభాష్ అన్నారు. చాంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బండ్లగూడ జహంగీరాబాద్ లో ఆంటి డ్రగ్స్ పై విద్యార్థులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సౌత్ ఈస్ట్ డీసీపీ పటేల్ కాంతిలాల్ సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వైద్య విద్యార్థినిలతో ఆంటి డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీసీపీ పటేల్ కాంతిలాల్ సుభాష్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రతిక్షణం తనిఖీలు చేపడుతుందన్నారు. డ్రగ్స్ వాడటం వల్ల జీవితాలు చిన్న భిన్నం అవుతాయని తెలిపారు. డ్రగ్స్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ స్వామి, చాంద్రాయణ గుట్ట ఏసీపీ మనోజ్ కుమార్, చాంద్రాయణ గుట్ట సీఐ గురునాథ్, కంచన్ బాగ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి, బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Similar News