జీహెచ్ఎంసీ అధికారులు వస్తున్నారు..జాగ్రత్త..!

అనుమతులు తీసుకుని సెల్లార్లు తవ్విన యజమానులు, నిర్మాణదారులకు జీహెచ్‌ఎంసీ బిగ్ అలర్ట్ ప్రకటించింది..

Update: 2024-08-14 02:27 GMT

దిశ, సిటీబ్యూరో: అనుమతులు తీసుకుని సెల్లార్లు తవ్విన యజమానులు, నిర్మాణదారులు వీలైంత త్వరగా సెల్లార్లను పూర్తి చేసుకోవాలని సూచించటంతో పాటు వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్ల తవ్వకాలకు అనుమతులను నిలిపివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వెల్లడించారు. నివాసాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకుని పనులు చేపట్టిన నిర్మాణదారులు కూడా వెంటనే ప్రహరీ గోడలను నిర్మించుకోవాలని సూచించింది. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్ల జోనల్ సిటీ ప్లానర్, జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆరు జోన్లలో 167 సెల్లార్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వీటి పనులు పురోగతితో పాటు నిర్మాణంలో నాణ్యతను పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎల్బీనగర్‌లో 33 సెల్లార్లు, చార్మినార్ జోన్‌లో 27, ఖైరతాబాద్‌లో 40, సికింద్రాబాద్ జోన్‌లో 27 సెల్లార్లతో పాటు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో గుర్తించిన సెల్లార్లు మొత్తం 167 వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

శిథిలావస్థ భవనాలపై నజర్

జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 526 శిథిలావస్థలోనున్న భవనాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కూలిపోయే స్థితిలో ఉంటే వాటిని నేలమట్టం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా సెల్లార్లను, రిటైనింగ్ వాల్స్‌లను నిర్ణీత గడువులోపు పూర్తి చేయని పక్షంలో, వాటి వల్ల జరిగే ప్రమాదాలకు నిర్మాణదారులనే బాధ్యులను చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News