దిశ, కార్వాన్ః అక్రమంగా సరఫరా చేస్తున్న రూ.46 లక్షల విలువ చేసే గంజాయితో పాటు, హ్యాష్ ఆయిల్ ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన నాంపల్లి ఎక్సైజ్ భవన్‌లో ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి వివరాలను వెల్లడించారు. కడపకు చెందిన సాధిక్ వలీ, రంపచోడ వరంకు హరికుమార్, సత్యనారాయణ అనే ముగ్గురు హైదారాబాద్ మెహిదీపట్నం నుంచి అత్తాపూర్ మొగల్ కా నాలా దూల్ పేట్ కు 4.2కిలోల హ్యాష్ అయిల్‌ను సరఫరా చేస్తూ ఉండగా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ సూపరిండెంట్ ఎన్ అంజి రెడ్డి బృందం మొగల్‌కా నాలా వద్ద పట్టుకొని విచారించగా రాజమండ్రిలో మరింతగా గంజాయి ఉన్నట్లు తెలిపారు. ప్రత్యెక బృందాన్ని పంపించి అక్కడి నుంచి 70.15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.46 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. అపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా 95 శాతం మేర గంజాయి అమ్మకాలను నిలిపి వేశామని 62 మంది నేరుస్తులను జైల్లోకి పంపించామనన్నారు. జాయింట్ కమిషనర్ ఖురేషితోపాటు ఎక్సైజ్ సూపరిండెంట్ ఎన్. అంజి రెడ్డి, సీఐలు మధాుబాబు, గోపాల్‌లు ఉన్నారు.