మంత్రి తలసాని శిబిరంలో మరో వికెట్ అవుట్..
సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శిబిరం నుండి మరో వికెట్ కాంగ్రెస్ గూటికి చేరునున్నారు.
దిశ, బేగంపేట : సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శిబిరం నుండి మరో వికెట్ కాంగ్రెస్ గూటికి చేరునున్నారు. రామ్ గోపాల్ పేట సీనియర్ నాయకులు సికింద్రాబాద్ గణపతి టెంపుల్ మాజీ డైరెక్టర్ త్రికాల మనోజ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అనుచరులతో సోమవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ లో స్థానిక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంత్రి తలసాని వ్యవహార శైలి నచ్చకపోవడం ఈ పార్టీలో ఇమడలేకపోతున్నట్టు మనోజ్ కుమార్ వెల్లడించారు. గత గ్రేటర్ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ టికెట్ వస్తుందని నమ్మకంతో తాను నామినేషన్ వేసి అనంతరం నామినేషన్ విత్ డ్రా చేసుకో, నీకు నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని స్వయానా మంత్రి తలసాని తనకు హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.
అనంతరం గ్రేటర్ ఎన్నికల తర్వాత తనను పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వరుస బీఆర్ఎస్ కార్యక్రమాలలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం తనను బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తే రామ్ గోపాల్పేట నిర్వహించిన సమావేశంలో తనకు ఆహ్వానం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్ లో స్థానిక అత్తిలి శ్రీనివాస్ గౌడ్ పార్టీ కార్యకర్తలను ఎదగనీయకుండా ఒంటెద్దు పోకడ పోతున్నారని ఆయన విమర్శించారు. స్థానిక డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ వల్లనే మనస్థాపానికి గురై పార్టీ పెడుతున్నట్లు ఆయన ఆరోపించారు.
శ్రీనివాస్ గౌడ్ పార్టీలో ఉన్నంత వరకు డివిజన్ అభివృద్ధి బాగుపడదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాంటి ఎంతోమంది బాధితులు శ్రీనివాస్ గౌడ్ చేతిలో బలహీనపడినట్లు ఆయన ఆరోపించారు. గతంలో రాంగోపాల్పేట డివిజన్ శ్రీనివాస్ గౌడ్ సఖ్యత లేకనే బీఆర్ఎస్ నుండి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి బీజేపీ కార్పొరేటర్ గా చీర సుచిత్ర శ్రీకాంత్ గెలుపొందిన విషయం ఆయన గుర్తు చేశారు. త్వరలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో తన మిత్ర బృందం స్థానిక డివిజన్ బీఆర్ఎస్ నాయకులతో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు.