హరితహారం సక్సెస్.. సిటీలో పెరిగిన ఫారెస్ట్రీ
దిశ, సిటీ బ్యూరో: పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వేగంగా అభివృద్ది చెందుతున్న
దిశ, సిటీ బ్యూరో: పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వేగంగా అభివృద్ది చెందుతున్న గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఇందుకు దీటుగా కాలుష్య సమస్యను ఎదుర్కొంటూ, ప్రస్తుతం నగరంలోనున్న పచ్చదనాన్ని పెంపొందించుకోవటంలో వివిధ శాఖలు సఫలమయ్యాయనే చెప్పవచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగరంలో భారీగా చెపట్టిన హరితహారం కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది. మహానగరవాసులకు మరింత మెరుగైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించటంతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు వివిధ రకాలుగా జరిగిన కృషి ఫలించింది. ముఖ్యంగా పెరుగుతున్న పట్టణీకరణ, రవాణా కారణంగా వాతావరణంలో పెరిగే ఉష్ణోగ్రతను తగ్గించడం, కాలుష్యాన్ని కంట్రోల్ ఉంచుకునేందుకు వివిధ ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేయడం పాటు ఓపెన్ స్థలాలలో యాదాద్రి తరహాలో మియవాకి, వర్టికల్, థీమ్ పార్కులు, మెరిడియన్ , అవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ సుందరీకరణ ట్రీ పార్క్ లు లాంటి తదితర రకాల పేర్లతో పచ్చదనం, సుందరీకరణ పనులు ప్రతిష్టాత్మకంగా జీహెచ్ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా లక్షల్లో నాటిన మొక్కలు, పదుల సంఖ్యల్లో తీర్చిదిద్దిన పార్కుల ప్రభావంతో హైదరాబాద్ మహా నగరం పరిధిలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెరిగినట్లు తేలింది. ఈ విస్తీర్ణం గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం కాగా, ప్రస్తుతం 81.81చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ ఐ) ప్రకటించినట్లు అధికారులు తెలిపారు . అంతే కాకుండా అర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ (ఎఫ్ ఏఓ) సంస్థ ఇప్పటికే 2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ గా గుర్తించిన సంగతి తెల్సిందే. అప్పట్లో నెలకొన్న కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వంటి పరిస్థితుల కారణంగా ఈ విషయం పెద్దగా ప్రచారానికి నోచుకోలేదని జీహెచ్ ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ పోటీలో 63 దేశాలకు చెందిన 119 పట్టణాలు, నగరాలు పాల్గొనగా అరుదైన ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ టైటిల్ మహానగరానికే దక్కింధి. ఆహ్లాదకరమైన వాతావరణం తో పాటు క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించేందుకు పార్క్ లు దోహద పడుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణానికి, పచ్చధనానికి నగరవాసులు ఆకర్షితులను చేసేందుకు వారికి ఆసక్తి కరమైన క్రీడాంశాలతో పలు పార్కుల్లో మినీ ప్లే కోర్టు లు అభివృద్ధి చేశారు. సైక్లింగ్ తో పాటుగా వాలీ బాల్, బాస్కెట్ బాల్, అడ్వెంచర్ గేమ్స్, సాంప్రదాయ, ఆధునిక ఆటలు ఆడుకునే విధంగా సౌకర్యాలు కల్పించారు. నగరంలో నివసించే ప్రజలకు జీవన ప్రమాణాలను పెంపొందించే విషయం లో మంచి వాతావరణం కల్పించేందుకు, మహానగరం పరిధిలో ఎక్కడైనా ఒక ఎకరం ఖాళీ ఉంటే చాలు పార్కు ఏర్పాటుకు జీహెచ్ ఎంసీ యుద్దప్రాతిపదికన సన్నాహాలు చేస్తుంది. పార్కు లు ఆహ్లాదకరంగా, క్రీడలకు ప్రోత్సాహంగా తీర్చిదిద్దుకోవటంతో పాటు నగరంలోని పలు ప్రాంతాలు ప్రత్యామ్నాయంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి కూడా అభివృద్ది చెందుతుంది