జూబ్లిహిల్స్ ఓట్ల లేక్కింపులో జాప్యం..అసలు ఎం జరుగుతుంది?

రాష్ట్రం అంతా ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుంటే, జూబ్లిహిల్స్‌లో మాత్రం చాలా నెమ్మదిగా అనేక సాంకేతిక లోపాలతో జరుగుతున్నట్లు తెలుస్తుంది.

Update: 2023-12-03 11:20 GMT

దిశ, జూబ్లిహిల్స్ : రాష్ట్రం అంతా ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుంటే, జూబ్లిహిల్స్‌లో మాత్రం చాలా నెమ్మదిగా అనేక సాంకేతిక లోపాలతో జరుగుతున్నట్లు తెలుస్తుంది. టైంకి రాని ఎన్నికల అప్ డేట్ మొదట కాంగ్రెస్ లీడ్‌లో వుండగా, లాంచ్ తర్వాత ఓట్ల లెక్కింపు మందకొడిగా జరిగింది. అసలు కారణం ఏంటి..? దాదాపు 13 ఈవిఎమ్‌లకు పైగా పలు లోపలున్నట్లు తెలుస్తుంది. 13 ఈవిఎమ్‌లకు సీల్ లేకుండా ఓపెన్ చేసి వుండటం..! రిజిస్టర్ నంబర్ టాలీ కాకపోవటం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవిఎమ్‌లు సీల్ లేకపవటం వాటిని పక్కన పెట్టి, వేరొక ఈవిఎమ్‌లు కౌంటింగ్ చెయ్యటం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీడియాకి అధికారులు ఎంట్రీ ఇవ్వకపోవడంతో, అసలు ఓట్ల లెక్కింపులో ఏమి జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News