జర్మనీ దేశస్థుడి డిజె ఈవెంట్ లో...డ్రగ్స్ కలకలం...

నూతన సంవత్సరపు వేడుకలను డ్రగ్స్ ఫ్రీ గా నిర్వహించేందుకు టీజీ న్యాబ్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 8 మంది గంజాయి,

Update: 2024-12-30 13:00 GMT

దిశ, సిటీక్రైం : నూతన సంవత్సరపు వేడుకలను డ్రగ్స్ ఫ్రీ గా నిర్వహించేందుకు టీజీ న్యాబ్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 8 మంది గంజాయి, కొకైన్, ఎంఫెటామైన్ సేవించి దొరికిపోయారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆదివారం జరిగిన జర్మనీ దేశానికి చెందిన డిజె బెన్ బోమర్ ఈవెంట్ లో టీజీన్యాబ్ అధికారులు పంజా విసిరారు. ఈ ఈవెంట్ లో కొంత మంది డ్రగ్స్ సేవించే అవకాశం ఉందనే సమాచారంతో టీజీన్యాబ్ అధికారులు సైబరాబాద్, రాచకొండ పోలీసులతో కలిసి మొత్తం 22 టీంలతో పాటు డాగ్ టీంలను ఏర్పాటు చేసి 4 వేల మంది పాల్గొన్న ఈవెంట్ లోకి ప్రవేశించారు. అనుమానితులను గుర్తించి 14 మందికి ఆధునిక డ్రగ్స్ కిట్స్ ద్వారా టెస్టులు చేశారు. అందులో 8 మంది డ్రగ్స్, గంజాయి, ఎంఫెటామైన్ ను తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఆ 8 మందిని టీజీ న్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఈవెంట్ కు వచ్చిన ప్రపంచవ్యాప్తంగా పేరొందిన డిజె బెన్ బోమర్ తో పాటు అతని బృందాన్ని కూడా టీజీ న్యాబ్ పోలీసులు డ్రగ్స్ కిట్ ద్వారా పరీక్షలను నిర్వహించారు. వారంతా డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. అరెస్టైన 8 మందిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగస్థులు, విద్యార్థి, వ్యాపారవేత్లలు ఉన్నట్లు టీజీ న్యాబ్ అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీలు ఇదే విధంగా కొనసాగుతాయని ఎవరిని వదిలిపెట్టేది లేదని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమామే అన్నారు. ఈ 8 మంది గంజాయి, డ్రగ్స్ ను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, వారికి ఎవరు ఇచ్చారు, వాటిని ఎక్కడ సేవించారనే కోణాల్లో దర్యాప్తు ను చేస్తున్నట్లు టీజీ న్యాబ్ అధికారులు తెలిపారు


Similar News