Ex MP: ఉత్తర తెలంగాణ ప్రజల కష్టాలు పోవాలంటే చేయాల్సింది ఇదే

ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాల ప్రజల కష్టాలు పోవాలంటే నాగపూర్(Nagpur) తరహాలో జేబీఎస్(JBS) నుంచి శామీర్ పేట(Shamirpet)కు డబుల్ డెక్ ఫ్లైఓవర్‌ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్(Vinod Kumar) డిమాండ్ చేశారు.

Update: 2025-01-02 10:03 GMT
Ex MP: ఉత్తర తెలంగాణ ప్రజల కష్టాలు పోవాలంటే చేయాల్సింది ఇదే
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాల ప్రజల కష్టాలు పోవాలంటే నాగపూర్(Nagpur) తరహాలో జేబీఎస్(JBS) నుంచి శామీర్ పేట(Shamirpet)కు డబుల్ డెక్ ఫ్లైఓవర్‌ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్(Vinod Kumar) డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 డిసెంబర్ 31న తెలంగాణ‌కు ప్రత్యేక హైకోర్టు(Telangana High Court) వచ్చింది.. హైకోర్టు వచ్చి నేటికి సరిగ్గా ఆరేళ్లు పూర్తయిందని అన్నారు. తెలంగాణ హైకోర్టుకు 42 మంది జడ్జిలు ఉండాలని నిర్ణయం తీసుకున్నా.. ఎప్పుడూ 23 మందికి మించి భర్తీ చేయడం లేదని తెలిపారు. తెలంగాణ జడ్జీల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వారు ఎవ్వరూ లేరని అన్నారు. పూర్తి స్థాయిలో జడ్జీలను నియమిస్తే దళిత గిరిజన వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హయాంలోనే మేము పార్లమెంట్‌లో ఒత్తిడి చేసిన ఫలితంగా హైకోర్టు జడ్జీల సంఖ్యను 42కు పెంచారని గుర్తుచేశారు.


హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగి పోతోంది.. జడ్జీలు పూర్తి స్థాయిలో ఉంటే తప్ప కేసులు తొందరగా పరిష్కారం కావని అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే జోక్యం చేసుకుని పూర్తిస్థాయిలో జడ్జీల నియమాకానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం న్యాయ వ్యవస్థలో కూడా పాటించాల్సిందే అని అన్నారు. వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణ హైకోర్టులో నలుగురు జడ్జీలు ఉన్నారని తెలిపారు. జడ్జీలు పూర్తిస్థాయిలో ఉంటేనే తెలంగాణకు కూడా న్యాయం జరుగుతుందని అన్నారు. శామీర్ పేటకు మెట్రో రైల్ ప్రాజెక్టు వేస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదని.. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల కష్టాలు పోవాలంటే నాగపూర్ తరహాలో jbs నుంచి శామీర్ పేట‌కు డబుల్ డెక్ ఫ్లై ఓవర్‌(Double-Deck Flyover)ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News