ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధిగా దిశ

దిశ దినపత్రిక నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్తుందని విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ అన్నారు

Update: 2025-01-04 14:13 GMT

దిశ, హిమాయత్ నగర్ : దిశ దినపత్రిక నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్తుందని విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ అన్నారు. శనివారం తన కార్యాలయంలో దిశ-2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'దిశ' ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. కచ్చితత్వంతో పాటు అత్యంత వేగంగా వార్తలను అందిస్తోందన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న పత్రిక యాజమాన్యాన్ని ఆళ్ల రామకృష్ణ అభినందించారు. ఎప్పటికప్పుడు డైనమిక్ ఎడిషన్ల ద్వారా తాజా సమాచారం అందించడం అభినందనీయమన్నారు.


Similar News