Mallareddy Hospital : మల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట రోగి బంధువుల ధర్నా

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Mallareddi)కి చెందిన ఆసుపత్రి ఎదుట ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి బంధువులు ధర్నాకు దిగారు.

Update: 2024-11-07 17:04 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(mallareddy)కి చెందిన ఆసుపత్రి ఎదుట ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి బంధువులు ధర్నాకు దిగారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఓ యువతికి మల్లారెడ్డి ఆసుపత్రిలో వైద్యులు సర్జరీ చేశారు. అయితే సదరు యువతికి సర్జరీ సమయంలో తీవ్ర రక్తస్రావం అవడంతో ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది. కాగా జరిగిన విషయాన్ని వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పడం పట్ల రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని దాచి, ఆరోగ్యం విషమించిందని చెబుతున్నారంటూ.. తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు రోగి బంధువులకు నచ్చజెప్పారు. కాగా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు తెలియ జేశారు.  

Tags:    

Similar News