పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-16 12:36 GMT

దిశ, చైతన్యపురి : పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. చైతన్యపురి డివిజన్ లోని భవాని నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. నూతనంగా నియామకమైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మూసీ అభివృద్ధికి మేము ఎప్పుడు అండగా ఉంటామని మూసీ అభివృద్ధి పేరుతో పేద మధ్య తరగతి ఇండ్లు కూలగొడతామంటే ఊరుకునేది లేదన్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రంగ నర్సింహా గుప్తా, మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షుడు జీ. లక్ష్మీనారాయణ, సెక్రటరీ సంతోష్ కుమార్, అదనపు జనరల్ సెక్రటరీ గిరిధర్, కోశాధికారి అశోక్, ఉపాధ్యక్షులు తుల్జా ప్రకాష్, జీ. తులసి కృష్ణ గౌడ్, తిరుపతి స్వామి, శ్రీనివాసాచారి, మల్లారెడ్డి, ఆదినారాయణ, నరసింహారెడ్డి, శేషకుమారి, వంశీకృష్ణ, సురేష్, మురళీధర్, రాజేష్ పాల్గొన్నారు.


Similar News