ఆటోనగర్ లో ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి
ట్రాన్స్ పోర్ట్ లో వచ్చిన సరుకులు దించుతూ ప్రమాదవశాత్తు జారి పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.
దిశ, చైతన్యపురి : ట్రాన్స్ పోర్ట్ లో వచ్చిన సరుకులు దించుతూ ప్రమాదవశాత్తు జారి పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. మన్సూరాబాద్ కు చెందిన కొమురయ్య (53) ఆటో నగర్ లో ఉన్న దీపక్ ట్రాన్స్ పోర్ట్ లో పనిచేస్తున్నాడు. ట్రాన్స్ పోర్ట్ లారీ లో వచ్చిన పార్శిల్స్ ని దించే సమయంలో తాడు తెగి మరో వాహనంపై పడటంతో కొమురయ్య తలకి బలమైన గాయం కాగా అక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ట్రాన్స్ పోర్ట్ గోడౌన్ లో ఉంచి ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు.