గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన భవనం కూల్చివేత
శేరిలింగంపల్లి సర్కిల్ 20 గచ్చిబౌలి డివిజన్ సిద్దిక్ నగర్ కాలనీలో ఉన్న
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి సర్కిల్ 20 గచ్చిబౌలి డివిజన్ సిద్దిక్ నగర్ కాలనీలో ఉన్న భవనం పక్కనే కొత్తగా ఇంటి నిర్మాణం కోసం సెల్లార్ తవ్వగా పక్కకు ఒరిగిన భవనాన్ని అధికారులు కూల్చివేత చేపట్టారు. అధికారులు సిద్ధం అయ్యారు. పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చి వేస్తున్నారు. హైడ్రా ఉపయోగిస్తున్న హైడ్రాలిక్ మిషన్ ను తీసుకువచ్చి ఓ వైపు నుండి కూల్చివేతలు చేపట్టారు. 150 గజాల ఇంటి నిర్మాణానికి పిల్లర్ల కోసం గుంతలు తవ్వుతుండగా పక్కనే 50 గజాల లో ఉన్న బిల్డింగ్ ఓ పక్కకు ఒరిగిపోయింది. ఇప్పటికే కుంగిన భవనం చుట్టు పక్కల ఉన్న ఇళ్ళల్లోని జనాలను అధికారులు ఖాళీ చేయించారు. రాత్రి నుంచి అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉదయం 11.20 గంటలకు కూల్చివేతలు చేపట్టారు.