అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి
పాతబస్తీలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ నిరంతరం చేస్తుందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
దిశ, చంపాపేట్ : పాతబస్తీలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ నిరంతరం చేస్తుందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. యాకూత్ పుర నియోజకవర్గంలోని సంతోష్ నగర్ డివిజన్ లో మంగళవారం ఆయన రూ. 2.90 కోట్ల నిధులతో పలు అభివృద్ధి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... హైదరాబాద్ పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలతో పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, ఎంఐఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.