క్రీడాభివృద్ధికి కాంగ్రెస్​ కృషి

క్రీడాభివృద్ధికి కాంగ్రెస్​ కృషి చేస్తుందని మేడ్చల్ మల్కాజిగిరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.

Update: 2024-09-25 12:14 GMT

దిశ, శేరిలింగంపల్లి : క్రీడాభివృద్ధికి కాంగ్రెస్​ కృషి చేస్తుందని మేడ్చల్ మల్కాజిగిరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ మొదటి ఈసీ సమావేశం బుధవారం ఉప్పల శ్రీనివాస్ గుప్త అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. ప్రతి జిల్లాకు ఒక స్టేడియం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారని అన్నారు.

     బ్యాడ్మింటన్ ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతామని, అందుకు అందరం కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. తన నియామకానికి సహకరించిన వారందరికి శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 14,15,16 తేదీలలో చిల్డ్రన్ డే కప్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అనంతరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ యూవీఎం బాబు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి క్రీడల శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ భాస్కర్, కోశాధికారి హర్ష యాదవ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ నాగరాజు, రమేశ్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ వేణు కుమార్, షేక్ రేష్మ , మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News