నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై అవగాహన సదస్సు

నారాయణ విద్యాసంస్థల ఆద్వర్యంలో విద్యార్థి బంగారు భవిష్యత్తుకై అవగాహన సదస్సు నిర్వహించారు.

Update: 2024-09-25 15:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: నారాయణ విద్యాసంస్థల ఆద్వర్యంలో విద్యార్థి బంగారు భవిష్యత్తుకై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు జీవితంలో గొప్పగా స్థిరపడాలంటే ఉన్నతమైన లక్ష్యం అవసరమని.. దానికోసం ప్రతి అడుగు ముఖ్యమైనదని, ప్రతి విద్యార్థి ఏ దిశగా ప్రయాణించి ఎలా చదివితే గమ్యాన్ని చేరుకుంటాడో తెలియక సందిగ్ధతతో సతమతమవుతూ ఉంటారని.. వారికి అవగాహన కల్పించడం కొరకే ఈ అవగాహన సదస్సు ఉపయోగపడుతుందన్నారు. మంచి సమాజ నిర్మాణానికి యువత ఎంతో అవసరమని, నవ సమాజ నిర్మాణం కోసం విలువలతో కూడిన విద్య ఉపయోగపడుతుందని.. నారాయణ విద్యాసంస్థల అధికారులు చెప్పుకొచ్చారు. ఈ అవగాహన సదస్సుకు హెచ్ఓడి, సీఈవో విజయ్ టెక్కి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఏ విధంగా భవిష్యత్తులో ప్రణాళిక చేసుకోవాలి. ఎలాంటి విద్యను అభ్యసిస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయనే విషయంలో.. విద్యార్థులకు, సదస్సుకు వచ్చిన తల్లిదండ్రులకు పూర్తి వివరాలు తెలిపి సందేహాలు తీర్చడం తో పాటు.. సలహాలు సూచనలు అందిస్తూ.. విద్యా ఉద్యోగం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గోపాల్ రెడ్డి జిఎం ఏమాంబార్ (ఏజిఎం) ముఖ్య అతిథిగా రాధాకృష్ణ, విజయ్ టెక్కి, ఆర్ఐ రవి ప్రసాద్, ప్రిన్సిపాల్ నీరజ, ఏవో రమేష్, ఏడి స్వామి ఆధ్వర్యంలో విద్యార్థి ఓరియంటేషన్ సదస్సు దిగ్విజయంగా జరిగింది.


Similar News