బీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి

బోరబండ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ షరీఫ్ అతని అనుచరులు సుమారు 200 మందితో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Update: 2023-03-13 12:50 GMT

దిశ, జూబ్లిహిల్స్ : బోరబండ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ షరీఫ్ అతని అనుచరులు సుమారు 200 మందితో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలందరూ తమ పార్టీ లో చేరడం జరుగుతుందని అన్నారు.

    బోరబండ డివిజన్ ను బంగారు బండగా రూపుదిద్దడం జరిగిందని, ఇదివరకు ఇక్కడ రౌడీయిజం ఉండేదని ఇప్పుడు అలాంటివి లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, సల్మాన్, ఇజస్, హాజీ, మస్తాన్, ఇర్ఫాన్, సాయి, అర్జున్, నరేష్, దినేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్, తన్ను ఖాన్, విజయకుమార్, డివిజన్ కో ఆర్డినేటర్ విజయసింహ, డివిజన్ ఇంచార్జి సిరాజ్, లక్ష్మణ్ గౌడ్, ఫయాజ్, దేవమణి, సరళ, శ్రీలక్షి పాల్గొన్నారు.

Tags:    

Similar News