మూసీ సుందరీకరణ పేరుతో మా ఇండ్లను కూల్చొద్దు

మూసీ సుందరీకరణ పేరుతో తమ ఇండ్లను కూల్చొద్దని హైడ్రా బాధితులు ఆందోళన చేపట్టారు.

Update: 2024-09-30 10:23 GMT

దిశ, కార్వాన్: మూసీ(Musi) సుందరీకరణ పేరుతో తమ ఇండ్లను కూల్చొద్దని హైడ్రా బాధితులు(hydra victims) ఆందోళన చేపట్టారు. సోమవారం సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. అంబర్ పేట్ గొల్నాక డివిజన్ హైడ్రా బాదితులు లకిడికాపూల్‌లోని హైదరబాద్ కలెక్టరేట్(Hyderabad Collectorate) కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు మాట్లాడుతూ.. మూసీ(Musi) సుందరీకరణ పేరుతో అంబర్పేట్ గోల్నాక డివిజన్‌లో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లను కూల్చి ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని చెప్పడం దారుణమన్నారు. 70 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. లక్షలు పెట్టి కొనుక్కొని మా పేరు పైన రిజిస్టర్ చేయించుకున్నాము. వరదలు వచ్చిన మా ఇండ్లు వరదల్లో మునిగిపోలేదు. మేము ప్రభుత్వానికి ఇంటి స్థలం, రిజిస్ట్రేషన్ పట్టా, కరెంట్, నల్లా బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నము. ప్రభుత్వం మాకు అన్ని హక్కులు కల్పించింది.

కానీ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఎఫ్‌టీ‌ఎల్, బఫర్ జోన్, రివర్ బెడ్ పేరు చెప్పి మా ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు తరలిస్తున్నారని వాపోయారు. పొలాలు, ఆస్తులు మెడలో ఉన్న బంగారం అమ్ముకొని బ్యాంకులో తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకున్నాము. ఇప్పటికి మిత్తి కడుతున్నామని. ఈ సందర్భంగా బాధితులు మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో రాములు సీపీఎం,మహేందర్ కన్వీనర్, శ్రీనివాస్ సీపీఎం నగర కార్యదర్శి, బస్తీ వాసులు మల్లేష్, ప్రసాద్, దుర్గ ఉమాదేవి, రవి తదితరులు పాల్గొన్నారు...


Similar News