Hyderabad Central Zone RTO: ఫ్యాన్సీ నెంబర్లలో భారీ ఆదాయం
హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఆర్టీవోకు ఫ్యాన్సీ నెంబర్లలో భారీగా ఆదాయం వచ్చింది...
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఖైరతాబాద్ ఆర్టీవోకు ఫ్యాన్సీ నెంబర్లలో భారీగా ఆదాయం వచ్చింది. సోమవారం నిర్వహించిన వేలంలో TG 09 B 9999 నెంబర్కు అత్యధికంగా 20 లక్షల ఒక వెయ్యి 111 రూపాయల ధర పలికింది. ఈ ఫ్యాన్సీ నెంబర్ను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. TG 09 C 0001 నెంబర్ను రూ.10,27,777కు, TG 09 C 0006 నెంబర్ను రూ. 3,85,000కు, TG 09 C 0009 నెంబర్ను రూ. 2,75,000కు, TG 09 C 0007 నెంబర్ను రూ. 1,77,777కు, TG 09 B 9909 నెంబర్ను రూ. 1,35,000కు, TG 09 C 0005 నెంబర్ను ఒక లక్షా 13 వేల రూపాయలకు, TG 09 C 0011 నెంబర్ను రూ. 1,04,999కు పలు సంస్థలు దక్కించుకున్నాయి. వేలం పాటలో 47 లక్షల 12 వేల 265 రూపాయల ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖ జాయింట్ కమిషనర్ రమేశ్ పేర్కొన్నారు.