దిశ, జూబ్లిహిల్స్ : హైదరాబాద్ పోలీసుల గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వ్యభిచార గృహాలలో పని చేస్తున్న యువతులను టార్గెట్ చేసి కొంతమంది పోలీసులు వేధిస్తున్నారనీ.. సమాచారం రావటంతో ముగ్గురు కానిస్టేబుల్ లను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారని తెలుస్తోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ముగ్గురు కానిస్టేబుళ్లు దామోదర్, నాగరాజు అలాగే సతీష్ లను తాజాగా సస్పెండ్ కావడం సంచలనం రేపుతోంది. మధురానగర్ పరిధిలో ఉన్న రెడ్ లైట్ ఏరియాలో... పనిచేస్తున్న మహిళల నుంచి డబ్బులు తీసుకుంటున్నారట. వారి నుంచి బలవంతంగా డబ్బులు తీసుకుని.. జల్సాలకు పాల్పడుతున్నారట. అంతేకాదు వారితో రాసలీలల్లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే పై అధికారులకు చెబుతామని ఆ మహిళలు హెచ్చరిస్తే... మీ దందా నడవకుండా చేస్తామని కానిస్టేబుల్ వార్నింగ్ ఇస్తున్నారాని విశ్వసనీయ సమాచారం . అలాగే స్పా సెంటర్లో కూడా ఈ ముగ్గురు కానిస్టేబుల్ డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ తో పాటు మరో హోంగార్డు కూడా ఉన్నారని చర్చ నడుస్తోంది. ఈ నలుగురు స్పా సెంటర్లకు ఇటు వ్యభిచార గృహాలకు వెళ్లిన వీడియో ఫుటేజ్ పోలీసులకు దొరికింది. అని ఈ నేపంతోనే ముగ్గురు కానిస్టేబుల్ పై అధికారులు వేటు వేశారు. అదే సమయంలో హోంగార్డును అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు .