రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఆర్‌టీసీ బస్సులోనే..

Update: 2022-02-10 05:56 GMT

దిశ, బహదూర్ పుర: రాత్రి, పగలు తేడా లేకుండా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నడుచుకుంటూనో, ఒంటరిగానో వెళ్లే వారిపైనే కాదు ఆఖరికి బస్సులోనూ చెన్ స్నాచింగ్ చేసేస్తున్నారు. ఇటువంటి సంఘటనే బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు వినోద్ కుమార్ అతని కుటుంబ సభ్యులు ముచ్చింతల్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు గురువారం ఉదయం ఆర్‌టీసీ బస్సులో బయలుదెరారు. బస్సు బహదూర్ పుర మీర్ ఆలం ట్యాంక్ వద్దకు రాగానే బస్సులో ఉన్న ముగ్గురు ఆగంతకులలో ఒక్కడు వినోద్ కుమార్‌పై పడి అనుమానం రాకుండా చైనును దొంగలించడం జరిగిందని బాధితుడు వినోద్ కుమార్ పోలీసులకు తెలిపారు.

వెంటనే బాధితుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన ఇతర ప్రయాణికులు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో ఇద్దరు  పరారయ్యారని వినోద్ తెలిపారు. ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో పట్టుబడ్డ ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని బహదూర్ పుర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని బహదూర్పురా పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News