నయా సాల్ వేడుకలకు బంపర్ ఆఫర్..ఈవెంట్ల ఏర్పాట్ల కోసం ప్లాన్స్
నయా సాల్ వస్తుందంటే ఆ జోషే వేరు.
దిశ, శేరిలింగంపల్లి : నయా సాల్ వస్తుందంటే ఆ జోషే వేరు. ఉరిమే ఉత్సాహం.. అవధుల్లేని ఆనందం.. స్నేహితులతో పార్టీలు.. అమ్మాయిలతో డ్యాన్స్ లు.. చిందేస్తూ.. మందేయ్ రా.. మందేస్తూ చిందేయ్ రా.. అంటూ కుర్రకారు జాలీగా ఎంజాయ్ చేస్తూ పబ్బుల్లో పార్టీలు, రిసార్ట్స్ లో గానా భజానాలతో సరదాగా ఎంజాయ్ చేయడం మామూలే.
పార్టీలకు పబ్స్, రెస్టారెంట్లు రెడీ..
న్యూయర్ వేడుకలకు బార్లు, రెస్టారెంట్లు, పబ్ లు, రిసార్ట్స్ లతో పాటు పబ్లిక్ ప్లేస్ ల్లో ఈవెంట్లు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. చాలా పబ్బుల్లోనూ పలువురు బాలీవుడ్ స్టార్స్, రాక్ స్టార్స్ తో ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. సమయం తక్కువగా ఉన్న ఈవెంట్ మేనేజర్లు మాత్రం ఎక్కడ తగ్గేది లేదంటున్నారు. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ లో ఫేమస్ డీజే ప్లేయర్ కార్తీక్, యానిమల్ లో డీజే రాజ్, బియాండ్ లో డీజే అలెన్, ఇన్ సోమియా, 10 డౌనింగ్ స్ట్రీట్ పబ్, పాష్ నాష్, హార్ట్ కప్, క్రాస్ బ్రీడ్, ట్రోప్స్, క్లబ్ రోగ్, ఫ్రాట్ హౌస్ ఇలా అనేక పబ్ లు ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
న్యూ ఇయర్ కి ఆఫర్లే ఆఫర్లు..
న్యూ ఇయర్ అంటేనే సరదాలు, సంబరాలే కాదు పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సాల్ లోకి ఎంటర్ అయ్యే క్రమంలో ఎన్నెన్నో ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈసారి అన్నింటికీ పర్మిషన్ లభించడంతో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి పబ్స్, రిసార్ట్స్, రెస్టారెంట్లు. ఇయర్ ఎండ్ తో పాటు వీకెండ్ లో డిసెంబర్ 31 వస్తుండడంతో రెగ్యులర్ ప్యాకేజీలు కాకుండా ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గచ్చిబౌలిలోని ఓ పబ్ ఏకంగా కపుల్స్ లో అమ్మాయికి మందు ఫ్రీ అంటూ ఆఫర్ ప్రకటిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ లోని మరో పబ్ వన్ ప్లస్ వన్ డ్రింక్ ఆఫర్ ప్రకటించింది. అయితే పై రెండింటికి కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరి అని, అది ఏ కలర్, ఏంటి అన్న విషయాలను ఇంకా ప్రకటించలేదు. ఇక రెస్టారెంట్లలో ఫ్యామిలీ ఫుడ్ ఆర్డర్ పై న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కేక్ ఆఫర్ ఇస్తోంది. ఈసారి ఓ అడుగు ముందుకేసి ఎర్లీ బర్డ్స్ కిడ్స్ 0-6 ఇయర్స్ పిల్లలకు రూ.2000 వేలు ఛార్జి ప్రకటించాయి కొన్ని రెస్టారెంట్లు.
పిల్లల కోసం వారు ఆడుకునేందుకు కిడ్స్ ఏరినా, పార్టీ థీమ్ ప్లేస్, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఉంటాయని, చిన్నారులకు ఇష్టమైన రకరకాల ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఎర్లీ బర్డ్ లేడీస్, ఎర్లీ బర్డ్ స్టాగ్స్ ఇలా అన్ని రకాల వారికి ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి పబ్స్. న్యూ ఈవెంట్ ఛార్జీలు కూడా ఆయా పబ్ లను బట్టి రేట్లు మారిపోతున్నాయి. ఓ పబ్ లో ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద కపుల్స్ కు రూ.4999 ఉండగా, 5 మెంబర్స్ టేబుల్ కు రూ.30 వేలు, 8 మంది టేబుల్ కు రూ.60 వేలు, 10 మంది టేబుల్ కు రూ.75 వేలు ఛార్జ్ చేస్తున్నాయి. బేకరీలు సైతం మేమేం తక్కువ కాదంటున్నాయి. కిలో కేక్ కొంటె అరకిలో కేక్ ఫ్రీ అంటూ ఆఫర్ పెట్టాయి. రిసార్ట్స్ ల్లో కపుల్ ఫేర్ ముందుకు స్టఫ్ ఫ్రీగా ఇస్తామని ఆఫర్స్ పెడుతున్నాయి. ఇలా ఆఫర్స్ ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
సిద్ధమైన యూత్..
కొత్త సంవత్సరం వేడుకలకు ఎవరికి వారు ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. క్లాస్ అనుకునే వారు పబ్బులు, రిసార్ట్స్ అంటుంటే మాస్ పీపుల్స్ తలా ఇన్ని డబ్బులు పోగేసుకుని ఫ్రెండ్స్ రూముల్లో పార్టీలు చేసుకునేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ఇక పెద్ద వారు కూడా తమ తమ ఫ్రెండ్స్ సర్కిళ్లలో న్యూ ఇయర్ ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.