HYD: టికెట్ ఎఫెక్ట్: మాజీ మంత్రి తుమ్మల ఇంట్లో కీలక సమావేశం

మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ....

Update: 2023-08-23 08:46 GMT

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అసంతృప్తుల జ్వాల ఎగిసిపడుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా వద్దా?,. వేరే పార్టీలోకి వెళ్లాలనే అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. కార్యకర్తలు ఓకే చెబితే బీఆర్ఎస్‌లో ఉండటం.. నో అంటే ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సై అనడం కోసం యత్నిస్తున్నారు. 

అటు మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు నుంచి టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు కలిగింది. దీంతో ఆయన సైతం పార్టీని వీడతారేమోనని బీఆర్ఎస్ అధిష్టానం ముందుగానే అప్రమత్తమైంది. తుమ్మలను బుజ్జిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎంపీ నామా నాగేశ్వరరావును రంగంలోకి దింపింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని తుమ్మలకు సూచించినట్లు తెలుస్తోంది. ఎంపీ నామా వెంట ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతోంది. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అటు తుమ్మల, ఇటు బీఆర్ఎస్ వర్గీయుల్లో నెలకొంది. మరి నామా ప్రయత్నం ఫలిస్తుందో.. విఫలమవుతుందో చూడాలి. 

Read More :  బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ గుడ్ బై.

Tags:    

Similar News